మద్యం దుకాణంలో పనిచేస్తున్న తమను ఆబ్కారీ అధికారులు అమానుషంగా కొట్టి గాయపరిచారని ఖమ్మం జిల్లా వైరాలో బాధితులు ఆందోళన నిర్వహించారు. తమపై దాడికి పాల్పడ్డ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు వైరా పాత బస్టాండ్ కూడలి, ఆబ్కారీ పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేపట్టారు.
'పనిచేసుకుంటున్న మమ్మల్ని అమానుషంగా కొట్టారు' - వైరా ఎక్సైజ్ కార్యాలయం ఎదుట నిరసన
ఖమ్మం జిల్లా వైరా ఆబ్కారీ స్టేషన్ ముందు పలువురు ఆందోళన చేపట్టారు. తమను అమానుషంగా కొట్టారని ఆరోపిస్తూ ధర్నాకు దిగారు.

'పనిచేసుకుంటున్న మమ్మల్ని అమానుషంగా కొట్టారు'
సంతబజారులోని దుకాణాన్ని జిల్లా అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేసిన సమయంలో సరైన పత్రాలు చూపలేదనే కారణంతో కొట్టారని ఆరోపించారు. రోజువారి పనిచేసే తమపై లాఠీతో దాడికి పాల్పడటం అమానుషమన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:విజయాలకు పొంగిపోము.. అపజయాలకు కుంగిపోము: కేటీఆర్