Priyanka Gandhi Fires on BRS :కుటుంబసభ్యుల కోసం సంపద పోగేసుకోవడం తప్ప కేసీఆర్‌కు ఎలాంటి ఆలోచన లేదని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) విమర్శించారు. ప్రజల సంక్షేమాన్ని గాలికొదిలేసిన.. బీఆర్‌ఎస్ పాలనకు అంతం పలికే సమయం వచ్చిందని పునరుద్ఘాటించారు. అన్నివర్గాల సంక్షేమమే లక్ష్యంగా పనిచేసే కాంగ్రెస్‌ని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రియాంక కోరారు.
రెండురోజుల పర్యటన కోసం రాష్ట్రానికి వచ్చిన కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకగాంధీ.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుడిగాలి పర్యటన చేశారు. ఖమ్మం, పాలేరు, సత్తుపల్లి నియోజకవర్గంలో రోడ్‌షోలో పాల్గొన్న ఆమె.. బీఆర్‌ఎస్ సర్కారుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏం లక్ష్యంతో అయితే కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఇచ్చిందో ఆ లక్ష్యం నెరవేరలేదని గుర్తుచేశారు. బీఆర్‌ఎస్ పాలనలో అన్నివర్గాలు తీవ్రంగా నష్టపోయాయని ప్రియాంక గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు.
సామాన్యులతో ప్రియాంకా గాంధీ సందడి - హుస్నాబాద్‌లో ఆ కుటుంబానికి సర్ప్రైజ్
Telangana Election Polls 2023 : ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో.. బీఆర్‌ఎస్(BRS) సర్కారు తీవ్రంగా వైఫల్యం చెందిందని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ విమర్శించారు. దేశంలో ప్రజలే నాయకులన్న ప్రియాంక.. జనం కంటే అతీతులు అన్నట్లుగా కేసీఆర్, మోదీ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రశ్నపత్రాల లీకేజీ(Paper Leackage) వల్ల నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారన్న ఆమె.. ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేసిన విద్యార్థుల భవిష్యత్ ఏంటని ప్రశ్నించారు.