తెలంగాణ

telangana

ETV Bharat / state

అకాల వర్షం.. తడిసిన ధాన్యం

రాష్ట్రంలో ఈరోజు కురిసిన అకాల వర్షం రైతులను అనేక ఇబ్బందులకు గురి చేసింది. కల్లాల్లో ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. పలు ప్రాంతాలలో పత్తి పంటలు సైతం తడిసిపోయాయి.

By

Published : Jan 3, 2020, 8:48 PM IST

Premature rain stained grain at khammam
అకాల వర్షం.. తడిసిన ధాన్యం

ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలంలో అకాల వర్షం కురిసింది. కల్లాల్లో ధాన్యం ఆరబోసిన సమయంలో ఒక్కసారిగా వర్షం పడటం వల్ల వాటిని కాపాడుకోవడానికి రైతులు ఉరుకులు పరుగులు పెట్టాల్సి వచ్చింది.

అకాల వర్షం.. తడిసిన ధాన్యం

ఏన్కూరు వ్యవసాయ మార్కెట్‌లో ఆరబోసిన ధాన్యం, ఎగుమతికి ఉన్న బస్తాలు తడిసిపోయాయి. ఇప్పటికే తేమశాతం పేరుతో రోజుల తరబడి ఉంటున్న కర్షకులకు అకాల వర్షం మరింత ఇబ్బందులు తెచ్చింది. పొలాల్లో తీయకుండా ఉన్న ప్రత్తి సైతం తడిసి ముద్దైంది.

ఇదీ చూడండి : నడిరోడ్డుపై పోకిరిని చితక్కొట్టిన మహిళలు

ABOUT THE AUTHOR

...view details