Ponguleti SrinivasReddy Fires on BRS : రాహుల్ గాంధీ సమక్షంలో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి హస్తం పార్టీలో చేరారు. పొంగులేటికి కండువా కప్పి రాహుల్ పార్టీలోకి ఆహ్వానించారు. పొంగులేటితో పాటు పలువురు నాయకులు కాంగ్రెస్ గూటికి చేరారు. ఈ సందర్భంగా భావి భారత దేశానికి దిక్సూచి రాహుల్ గాంధీ అని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. వారం రోజులుగా బీఆర్ఎస్ తనను ఎన్నో ఇబ్బందులు పెట్టిందని ఆయన తెలిపారు.
Ponguleti Joins in Congress :తెలంగాణ కోసం ఆరు దశాబ్దాలుగా తెలంగాణ బిడ్డలు పోరాటం చేశారని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఎన్నో పోరాటాలు చేసినా.. ఎవరూ తెలంగాణ ఇవ్వలేదని వివరించారు. తెలంగాణ బిడ్డల ఆకాంక్ష మేరకు సోనియా తెలంగాణ ఇచ్చారని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఇస్తే.. ఏపీలో కాంగ్రెస్ చనిపోతుందని సోనియాకు తెలుసని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. అయినా యువకుల బలిదానం జరగవద్దని రాష్ట్రం ఇచ్చారని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వివరించారు.
Ponguleti SrinivasReddy Comments on KCR :మాయమాటలు చెప్పి కేసీఆర్ అధికారంలోకి వచ్చారని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించారు. రైతు రుణాలు మాఫీ చేస్తానన్న హామీ నెరవేర్చలేదని దుయ్యబట్టారు. రాష్ట్రంలో 8,000 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని పునరుద్ఘాటించారు. అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలు నెరవేరుస్తుందని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు.
khammam Congress Meeting : లక్షలాది తెలంగాణ బిడ్డల కోరిక మేరకు హస్తం పార్టీలో చేరానని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వివరించారు. రాహుల్, ఖర్గే, ప్రియాంకను కలిశాక కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నానని పేర్కొన్నారు. కాంగ్రెస్ మాత్రమే బీఆర్ఎస్ను ఇంటికి పంపగలదని వ్యాఖ్యానించారు. భారత్ రాష్ట సమితిని బంగాళాఖాతంలో కలపాలంటే అది కాంగ్రెస్‌తోనే సాధ్యమని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.