తెలంగాణ

telangana

ETV Bharat / state

నన్ను ఇబ్బందిపెట్టినా ప్రజల నుంచి వేరుచేయలేరు: పొంగులేటి

ఖమ్మం రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. జిల్లాకు చెందిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పార్టీ మారతారని ప్రచారం సాగుతున్న వేళ మరోసారి ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనను ఇబ్బందిపెట్టినా ప్రజల నుంచి వేరు చేయలేరని అన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా ప్రజలను వదిలేది లేదని స్పష్టం చేశారు. ఉమ్మడి జిల్లాలోని ప్రతి గ్రామం తిరుగుతూ ప్రజలను కలుస్తానన్న పొంగులేటి.. సమయం, సందర్భం వచ్చినప్పుడు అన్ని విషయాలు చెబుతానన్నారు.

పొంగులేటి
పొంగులేటి

By

Published : Jan 10, 2023, 3:27 PM IST

Updated : Jan 10, 2023, 3:39 PM IST

ప్రజల ఆశీస్సులతో కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి పునరుద్ఘాటించారు. తనను అభిమానించే లక్షల మంది సైనికులు, అభిమానులు ఉన్నారని.. ప్రజల ఆశీర్వాదం ఉంటే పదవులు అవే వస్తాయని వ్యాఖ్యానించారు. నమ్ముకున్న వారి కోసమే తన జీవితమని స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా మణుగూరులో అభిమానులు, అనుచరులతో పొంగులేటి ఆత్మీయ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా తాను ఉగ్రవాదిని కాదని.. భూ కబ్జాలు, దందాలు చేయలేదని పొంగులేటి పేర్కొన్నారు. రాజకీయాల్లోకి రాకముందు నుంచే తాను కాంట్రాక్టర్‌నని తెలిపారు. కాంట్రాక్టు బిల్లులు రాకుండా.. తనను ఇబ్బందిపెట్టినా ప్రజల నుంచి వేరు చేయలేరని అన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా ప్రజలను వదిలేది లేదని స్పష్టం చేశారు. ఉమ్మడి జిల్లాలోని ప్రతి గ్రామం తిరుగుతూ ప్రజలను కలుస్తానన్న పొంగులేటి.. సమయం, సందర్భం వచ్చినప్పుడు అన్ని విషయాలు చెబుతానన్నారు.

ఈ క్రమంలోనే ప్రజల ఆశీర్వాదం ఉంటే పదవులు అవే వస్తాయని పేర్కొన్న పొంగులేటి.. తనకు అధికారం లేకున్నా నిత్యం ప్రజల్లోనే ఉన్నానని గుర్తు చేశారు. తనకు భద్రత తొలగించినా ఏమీ బాధపడలేదని.. ఇప్పుడున్న ఇద్దరు సిబ్బందిని తొలగించినా ఏమీ కాదన్నారు. నమ్ముకున్న వారి కోసమే తన జీవితమన్న ఆయన.. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు తెరాసలో చేరానని చెప్పారు. గడిచిన 4 ఏళ్లలో పార్టీలో ఏం గౌరవం పొందామో అందరికీ తెలుసన్నారు. ప్రజల ఆశీస్సులతో కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని స్పష్టం చేశారు.

నమ్ముకున్న వారి కోసమే నా జీవితం. ప్రజల ఆశీర్వాదం ఉంటే పదవులు అవే వస్తాయి. కేసీఆర్ పిలుపు మేరకు తెరాసలో చేరా. గడిచిన 4 ఏళ్లలో పార్టీలో ఏం గౌరవం పొందామో మీకూ తెలుసు. నాకు భద్రత తొలగించినా ఏమీ బాధపడలేదు. ఇప్పుడున్న ఇద్దరు సిబ్బందిని తొలిగించినా ఏమీ కాదు. లక్షలమంది అభిమానించే సైనికులు, అభిమానులు ఉన్నారు. ప్రజల ఆశీస్సులతో కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా. సమయం, సందర్భం వచ్చినప్పుడు అన్ని విషయాలు చెబుతా. - పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎంపీ

నన్ను ఇబ్బందిపెట్టినా ప్రజల నుంచి వేరుచేయలేరు: పొంగులేటి

ఇవీ చూడండి..

రాబోయే కురుక్షేత్రంలో కచ్చితంగా యుద్ధంలో పాల్గొంటా: పొంగులేటి

పొంగులేటి రాజకీయ అడుగులపై సర్వత్రా ఆసక్తి

Last Updated : Jan 10, 2023, 3:39 PM IST

ABOUT THE AUTHOR

...view details