Ponguleti Meets Tummala తుమ్మలతో పొంగులేటి భేటీ.. మాజీ మంత్రి నిర్ణయంపై అనుచరుల్లో ఉత్కంఠ Ponguleti Meets Tummala in Khammam : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయాలు(Khammam Politics 2023) రసవత్తరంగా సాగుతున్నాయి. మాజీ మంత్రి, బీఆర్ఎస్ అసంతృప్త నేత తుమ్మల నాగేశ్వరరావుతో.. కాంగ్రెస్ నేతలు వరుసగా భేటీ అవ్వడం ఆ జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. తాజాగా తుమ్మల(Tummala Nageswara Rao News) నివాసంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమావేశం అయ్యారు. తుమ్మల, పొంగులేటి భేటీతో రాజకీయంగా ఉత్కంఠ నెలకొంది. తుమ్మల ఇంటి వద్ద పెద్ద ఎత్తున చేరుకున్న కార్యకర్తలతో కోలాహలంగా ఉంది.
Tummala Nageshwar Rao Met Supporters : మీకోసం పోటీ చేస్తాను.. నిరంతరం ప్రజాక్షేత్రంలోనే ఉండండి.. అనుచరులతో తుమ్మల
Tummala To Join Congress :కాంగ్రెస్ పార్టీలోకి తుమ్మల రావాలని.. పొంగులేటి(Ponguleti Srinivas Reddy) ఆహ్వానం పలికినట్లు తెలిసింది. తుమ్మల రాక కోసం కాంగ్రెస్ పార్టీ ఎదురుచూస్తోందని ఆయన పేర్కొన్నట్లు సమాచారం. గతంలో ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో.. తనను, పువ్వాడ అజయ్‌కుమార్‌ను.. తుమ్మల బీఆర్ఎస్లోకి తీసుకెళ్లారని పొంగులేటి గుర్తుచేశారు. కానీ నేడు ఇరువురిని పార్టీ నుంచి బయటకు పంపించారని బీఆర్ఎస్పై మండిపడ్డారు. పార్టీలో నుంచి పోమ్మనలేక పొగబెడుతున్నారని విమర్శించారు. తుమ్మల, అతని అనుచరగణమంతా కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆహ్వానం పలికినట్లు పొంగులేటి తెలిపారు.
Congress Leaders Meeting Tummala Nageswara Rao : తుమ్మల నాగేశ్వరరావును కాంగ్రెస్‌లోకి ఆహ్వానించిన రేవంత్‌రెడ్డి
తనను కాంగ్రెస్ పార్టీలోకి పొంగులేటి ఆహ్వానించారని తుమ్మల స్పష్టం చేశారు. తన అనుచరులు, అభిమానులతో చర్చించిన అనంతరం.. పార్టీ మార్పుపై నిర్ణయం తీసుకోనున్నట్లు తుమ్మల వెల్లడించారు. ప్రజల సహకారంతో ఖమ్మం జిల్లాను అభివృద్ధి చేశానని తుమ్మల పేర్కొన్నారు. సీతారామ ప్రాజెక్టులోకి నీటిని విడుదల చేయడం తన రాజకీయ జీవిత లక్ష్యమని అన్నారు. పాలేరు లేదా ఖమ్మం నుంచి తుమ్మల పోటీ చేసే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
"గతంలో నన్ను, అజయ్‌కుమార్‌ను.. తుమ్మల బీఆర్ఎస్లోకి తీసుకెళ్లారు. నేతలపై వారికి ఇష్టం లేకపోతే పార్టీ నుంచి పంపించే కొన్ని పద్ధతులుంటాయి. పొమ్మనలేక పొగ బెడుతున్నట్లుగా.. అప్పుడు నన్ను, నేడు తుమ్మలను పార్టీ నుంచి పంపించారు. బీఆర్ఎస్లో తమకు నచ్చని వాళ్లను ఘోరంగా అవవమానించి బయటకు పంపుతున్నారు. తుమ్మలను, వారి కార్యకర్తలను కాంగ్రెస్‌లోకి రావాలని ఆహ్వానిస్తున్నాము".- పొంగులేటి, కాంగ్రెస్ నేత
"ప్రజల సహకారంతో ఖమ్మం జిల్లాను అభివృద్ధి చేశాను. సీతారామ ప్రాజెక్టులోకి గోదావరి జలాలను విడుదల చేయడం నా రాజకీయ జీవిత లక్ష్యం. ఈ లక్ష్యాన్ని నేరవేర్చడం కోసం ఎన్నికల్లో పోటీచేస్తాను. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నన్ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు.అనుచరులు, కార్యకర్తలతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటాను".- తుమ్మల నాగేశ్వరరావు, బీఆర్ఎస్ అసంతృప్త నేత
Thummala Nageswara Rao To Join Congress : ఖమ్మం రాజకీయాల్లో కీలక మలుపు.. కాంగ్రెస్ గూటికి తుమ్మల.. ఆరోజే చేరిక!