'చే' జారి కాషాయం కప్పుకున్న పొంగులేటి హస్తం నుంచి మరో నేత చేజారిపోయారు. మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడారు. రాజీనామా లేఖను రాహుల్ గాంధీకి పంపారు. ఇవాళ మధ్యాహ్నం ప్రధానితో సమావేశమైన పొంగులేటి మోదీ నాయకత్వంలో దేశాభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.
ఉగ్రదాడిపై వారి తీరు బాధాకరం
టికెట్ కేటాయింపు విషయంలో రాష్ట్ర కాంగ్రెస్ నేతల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కేటాయింపులో ధనప్రభావం ఉందని ఆరోపించారు. తప్పని పరిస్థితుల్లో పార్టీని వీడుతున్నట్లు స్పష్టం చేశారు. రాష్ట్రంలో, దేశంలో హస్తం పార్టీలో జరుగుతున్న పరిణామాల పట్ల కలత చెందినట్లు పొంగులేటి ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రదాడిపై కాంగ్రెస్ నేతలు మాట్లాడిన తీరు చాలా బాధాకరమన్నారు.
మళ్లీ మోదీయే ప్రధాని
మోదీలాంటి బలమైన నాయకుడి నాయకత్వంలో పనిచేయాలనే రాజీనామా చేసినట్లు స్పష్టం చేశారు. మళ్లీ మోదీయే ప్రధాని అవుతారని ధీమా వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి:భారత్ భేరి: నరేంద్రుడిదీ కవిత కథే!