రెండో విడత స్థానిక సంస్థల ఎన్నికలకు ఖమ్మం జిల్లాలో పోలింగ్ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. జడ్పీటీసీ, ఎంపీటీసీల వారీగా నియమించిన సిబ్బందికి పోలింగ్ సామాగ్రి అందించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్ వద్ద సిబ్బంది బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామాగ్రిని తీసుకున్నారు. తమకు కేటాయించిన కేంద్రాలకు వెళ్లారు. ఏన్కూరు, తల్లాడ పంపిణీ కేంద్రాలను జడ్పీ సీఈవో ప్రియాంక పరిశీలించారు. సామాగ్రి పంపిణీ ప్రక్రియను స్థానిక అధికారుల ద్వారా తెలుసుకున్నారు.
ప్రాదేశిక ఎన్నికలకు ఖమ్మం సిద్ధం - Polling Arrangements in Khammam
రెండో విడత ప్రాదేశిక ఎన్నికలకు ఖమ్మం జిల్లా సిద్ధమైంది. రేపు జిల్లాలో జరిగే స్థానాలకు అధికారులు అన్ని ఏర్పాట్లును చేశారు. సిబ్బందికి పోలింగ్ సామాగ్రిని అందించారు. కేంద్రాలను జడ్పీ సీఈవో ప్రియాంక పరిశీలించారు.
ప్రాదేశిక ఎన్నికలకు ఖమ్మం సిద్ధం