ఖమ్మం జిల్లా మధిర పురపాలికలో ఓటర్ల జాబితా తప్పుల తడకగా మారిందని రాజకీయ పార్టీల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు తెలిపేందుకు స్థానిక కార్యాలయంలో కమిషనర్ దేవేందర్ అధ్యక్షతన రాజకీయ పక్షాల నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు. నివాసముండేది ఒక చోట అయితే వేరే చోట ఓటు ఉందని పార్టీల నాయకులు ఆరోపించారు. జాబితా రూపకల్పనలో అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహించారని ధ్వజమెత్తారు. వందలకొద్దీ ఉన్న తప్పులను వెంటనే సరిచేయాలని డిమాండ్ చేశారు.
నివసించేది ఒకచోట..ఓటు మరోచోట..అధికారుల నిర్వాకం - మధిర పురపాలక ఓటర్ల జాబితా తప్పులు
మధిరలో పురపాలక ఎన్నికల సందర్భంగా రూపొందించిన ఓటర్ల జాబితా తప్పులతడకగా ఉందని రాజకీయ పార్టీల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జాబితాపై కమిషనర్ దేవేందర్ ఆధ్వర్యంలో అభ్యంతరాలు తెలిపారు.
పురపాలక ఓటర్ల జాబితా