తెలంగాణ

telangana

ETV Bharat / state

Political Heat in Khammam District : ఖమ్మంలో రాజుకుంటున్న రాజకీయం... ప్రచారాలు ప్రారంభించిన నేతలు - ఖమ్మంలో కమ్యూనిస్టు పార్టీ రాజకీయ కార్యాచరణ

అసెంబ్లీ ఎన్నికల పోరులో కీలకమైన ఎన్నికల షెడ్యూల్ విడుదలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయ వేడి మరింత రాజుకుంటోంది. ఇప్పటికే ఎన్నికల కార్యక్షేత్రంలోకి దూకిన రాజకీయ పార్టీలు సమరానికి సై అంటే సై అంటున్నాయి. విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లి విజయబావుటా ఎగురవేసేందుకు అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తున్నాయి. ఎన్నికల పోరుకు అవసరమైన ప్రచార సామాగ్రి ఇప్పటికే పార్టీ కార్యాలయాలకు చేరింది. ఎన్నికల క్షేత్రంలో ఓ అడుగు ముందుకేసిన అధికార బీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి ముందంజలో ఉంది. నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారపర్వంలోకి దిగారు. గడప గడపకూ కాంగ్రెస్ పేరుతో అన్ని నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ ప్రచారపర్వానికి శ్రీకారం చుట్టినప్పటికీ..అభ్యర్థుల లెక్కలు తేలకపోవడంతో ఆ పార్టీ శ్రేణులకు నిరీక్షణ తప్పడం లేదు. బీజేపీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఇంకా కొలిక్కి రాకపోగా.. ఈసారి ఎన్నికల పోరులో సై అంటున్న కామ్రెడ్లు.. పొత్తులతోనా, ఒంటరిగా బరిలోకి దిగుతాయా అన్న అంశాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

Political Heat in Khammam
Political Heat in Khammam District

By ETV Bharat Telangana Team

Published : Oct 11, 2023, 3:11 PM IST

Political Heat in Khammam District : అసెంబ్లీ ఎన్నికల కార్యక్షేత్రంలో బీఆర్ఎస్ ముందు వరుసలో నిలిచింది. ఆగస్టు 21న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ అభ్యర్థులను ప్రకటించగా.. ఉమ్మడి జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రజా క్షేత్రంలోకి దూకారు. ప్రత్యర్థులెవరో తేలకముందే నియోజకవర్గాల్లో ప్రచారపర్వానికి శ్రీకారం చుట్టారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఇటీవలే జిల్లాలో పర్యటించి ఎన్నికల శంఖారావం పూరించారు. ఖమ్మం, సత్తుపల్లి బహిరంగ సభల్లో పాల్గొని పార్టీ నాయకులు, కార్యకర్తల్ని ఎన్నికలకు కార్యోన్ముఖుల్ని చేశారు. దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రజల్లోకి వెళ్తున్నారు. ఖమ్మం మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఆత్మీయ సమ్మేళనాల పేరిట విస్తృతంగా ప్రజలను కలిసి మళ్లీ గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు.

Congress Leaders on Telangana Assembly Elections : 'ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10కి 10 స్థానాలు.. కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయం'

ఈ నెల 15న పార్టీ అభ్యర్థులకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీ-ఫారాలు అందజేసిన తర్వత ఎన్నికల ప్రచారాన్ని గులాబీ పార్టీ మరింత ముమ్మరం చేయనుంది. ఈనెల 27న పాలేరులో బహిరంగ సభ ద్వారా.. జిల్లాలో ఎన్నికల శంఖారావానికి శ్రీకారం చుట్టనున్న కేసీఆర్.. వచ్చే నెల 1న సత్తుపల్లి, ఇల్లందు, 4న కొత్తగూడెం, ఖమ్మం బహిరంగ సభల్లో పాల్గొననున్నారు.

Congress Candidate Selection From Khammam: ఉమ్మడిఖమ్మం జిల్లాలోనిగెలుపు గుర్రాల కోసం నియోజకవర్గాల వారీగా కాంగ్రెస్ పార్టీ గత కొన్ని రోజులుగా చేస్తున్న కసరత్తు దాదాపు కొలిక్కి వచ్చింది. త్వరలోనే అభ్యర్థులను ప్రకటించేందుకు కాంగ్రెస్ పార్టీ సమాయత్తమతోంది. ఇప్పటికే మధిర, భద్రాచలం నియోజకవర్గాల్లో కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తుండగా.. మిగిలిన 8 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంది. 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు దాదాపు 130 మంది ఆశావహ అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. సర్వేలు, ప్రజాదరణ ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక ఉంటుందని.. త్వరలోనే పార్టీ అభ్యర్థుల ప్రకటన ఉంటుందని కాంగ్రెస్ ముఖ్యనాయకుడొకరు ఈటీవీ భారత్‌కు వెల్లడించారు. ఈసారైనా బోణీ కొట్టాలన్న లక్ష్యంతో బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. ఖమ్మంలో అమిత్ షా బహిరంగ సభతో కమల దళంలో కొత్త ఉత్సాహం నింపింది. నియోజకవర్గాల వారీగా బలమైన అభ్యర్థుల కోసం బీజేపీ అన్వేషణ ఇంకా కొనసాగుతుంది. ఎన్నికల బరిలో నిలిచేందుకు సై అంటున్న బహుజన సమాజ్ పార్టీ 8 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించింది.

Wyra MLA Fires on Minister Puvvada : ఉమ్మడి ఖమ్మం బీఆర్​ఎస్​లో లొల్లి.. ఏకంగా మంత్రిపైనే వైరా ఎమ్మెల్యే విమర్శలు

Communist Party Political Activity in Khammam : కమ్యూనిస్టులకు బలమున్న జిల్లాల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రధానమైంది. వామపక్ష పార్టీలకు రాష్ట్ర నాయకత్వం వహించే నాయకులంతా ఈ జిల్లాకు చెందిన వారే కావడంతో ఇక్కడ ఈసారి పట్టు నిలుపుకునేందుకు కమ్యూనిస్టులు ఉవ్విళ్లూరుతున్నారు. తమ్మినేని వీరభద్రం సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా ఉండగా.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా కూనంనేని సాంబశివరావు రాష్ట్ర పార్టీకి రథసారథిగా ఉన్నారు. వీరిద్దరు ఉమ్మడి జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న వారు కావడంతో.. వచ్చే ఎన్నికలను కామ్రేడ్లు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అయితే.. కాంగ్రెస్‌తో కలిసి ఎన్నికల బరిలో నిలుస్తాయా... లేక రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయా అన్నది తేలాల్సి ఉంది. పొత్తుల ప్రక్రియ కొలిక్కి వస్తే.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే అత్యధికంగా స్థానాలు కోరే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ పొత్తు కుదరని పక్షంలో తమకు బలమున్న స్థానాల్లో ఎన్నికల బరిలో నిలిచేలా కమ్యూనిస్టులు కార్యాచరణ రూపొందిస్తున్నారు.

CM KCR Election Campaign Schedule 2023 : 110 నియోజకవర్గాలు.. 17 రోజులు.. 41 సభలు.. ఉద్ధృత ప్రచారానికి సీఎం కేసీఆర్ సన్నాహాలు

BRS Jangaon MLA Ticket To Palla Rajeshwar Reddy : ఊహించినట్లే జరిగింది.. పల్లా రాజేశ్వర్​ రెడ్డినే వరించిన జనగామ ఎమ్మెల్యే టికెట్

ABOUT THE AUTHOR

...view details