Political Heat in Khammam :2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాలకు గానూ బీఆర్ఎస్కు దక్కింది ఒక్కస్థానమే. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాపై పార్టీ అధిష్ఠానం ప్రత్యేక దృష్టి సారించింది. ఈసారి ఎక్కువ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా స్వయంగా పార్టీ అధినేత కేసీఆర్ రంగంలోకి దిగి ఇప్పటికే పలుమార్లు ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేశారు. జనవరిలో ఖమ్మం వేదికగా నిర్వహించిన బహిరంగ సభ నుంచి మంత్రి హరీశ్‌రావు జిల్లా రాజకీయాలపై ప్రత్యేక దృష్టి సారించి చక్కబెడుతున్నారు. ఎన్నికల సమయం కావడంతో ముఖ్య నాయకుల మధ్య సమన్వయం కోసం మంత్రి మంత్రాంగం నడుపుతున్నారు.
Assembly Elections Heat in Khammam :ఇవాళ, రేపటిలో అభ్యర్థుల జాబితా(BRS MLA Candidates 2023) వెలువరించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పార్టీ అంతర్గతంగా నిర్వహించిన సర్వేల ఆధారంగా టికెట్లు(BRS MLA Tickets Telangana 2023) కేటాయిస్తామని బీఆర్ఎస్ అధిష్ఠానం చెప్పుకొస్తోంది. సర్వే నివేదికల ఆధారంగా 10 నియోజవర్గాల్లో అభ్యర్థుల జాబితాపై చేసిన కసరత్తు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలిసింది. ప్రస్తుతం బీఆర్ఎస్కు ఉమ్మడి జిల్లాలో 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో ఎక్కువమంది సిట్టింగులకు మళ్లీ అవకాశం ఇచ్చేందుకే అధిష్ఠానం మొగ్గు చూపినట్లు తెలిసింది. అయితే.. మూడు, నాలుగు నియోజకవర్గాల్లో అభ్యర్థిత్వాలపై ఇంకా కొంత తర్జన భర్జన సాగుతుందన్న ప్రచారం సాగుతోంది. తుది జాబితాపై త్వరలోనే స్పష్టత వస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
BRS focus on Khammam Politics 2023 :అభ్యర్థిత్వాల ఖరారు ఇవాళ, రేపటిలో ఉందన్న ప్రచారం జోరుగా సాగుతుండటంతో సిట్టింగులతో పాటు.. ఆశావాహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మరోవైపు పలు నియోజకవర్గాల్లో ఎన్నికల సమన్వయం కోసం బీఆర్ఎస్ ఇంఛార్జీలను నియమించింది. వైరా-మంత్రి పువ్వాడ(Minister Puvvada Ajay), మధిర- నామా నాగేశ్వరరావు, కొత్తగూడెం-ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఇల్లందు-తాతామధుసూదన్ను ఇంఛార్జీలుగా నియమించినట్లు తెలిసింది. మిగిలిన నియోజకవర్గాలకు త్వరలోనే పార్టీ ముఖ్యనేతలను సమన్వయకర్తలుగా నియమించి అధికారికంగా ప్రకటిస్తారని తెలిసింది.
BRS MLA Candidates 2023 : ఆగస్టులో BRS అభ్యర్థుల ప్రకటన.!
పొంగులేటి చేరికతో నియోజకవర్గాల వారీగా పోటాపోటీ : ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్(Telangana Congress) 6 స్థానాలు గెలుచుకుంది. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో నలుగురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ గూటికి చేరారు. ప్రస్తుతం కాంగ్రెస్‌కు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. మిగిలిన 8 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ తరపున బరిలో నిలిచేందుకు ఆశావహుల జాబితా భారీగానే ఉంది.
Khammam Politics 2023 :జిల్లాలో ఇప్పటికే సీనియర్ నేతలు మల్లు, భట్టి విక్రమార్క, రేణుకా చౌదరి వర్గాలుగా పార్టీలో రాజకీయాలు సాగుతుండగా.. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి(Ponguleti Srinivas Reddy) కాంగ్రెస్‌లో చేరికతో నియోజకవర్గాల వారీగా పోటాపోటీ నెలకొంది. ఒక్కో నియోజకవర్గం నుంచి ముగ్గురికిపైనే ఆశావహ అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షిచుకుంటున్నారు. సెప్టెంబర్ మొదటి వారం తర్వాత అభ్యర్థుల తొలిజాబితా ప్రకటిస్తామని కాంగ్రెస్ ప్రకటించడంతో.. ఆశావహులు ఎవరికి వారే ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
Telangana Congress Plans Assembly Elections 2023 :ఇంకొవైపు.. నియోజకవర్గాల వారీగా అభ్యర్థిత్వాల కోసం ఈసారి దరఖాస్తులను ఆహ్వానించడంతో నాయకులు భారీగానే పోటీ పడుతున్నారు. ఈ నెల 25 వరకు దరఖాస్తులకు అవకాశం ఉండటంతో ఒక్కో నియోజకవర్గంలో మూడుకు మించి దరఖాస్తులు దాఖలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఎన్నికల బరిలో నిలిచేందుకు కాంగ్రెస్‌లో ఈ సారి తీవ్ర పోటీ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే పార్టీ అధిష్ఠానం టికెట్ ఇచ్చిన అభ్యర్థుల గెలుపుకోసం కృషి చేస్తామని ముఖ్య నేతలంతా ప్రకటిస్తుండటం ఆ పార్టీకి కలిసివచ్చే అంశమే.