ప్రత్యక్షంగా పరిశీలన
పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లపై ఆకస్మిక తనిఖీ - state election commition
ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని మధిరలో పోలింగ్ కేంద్రాలను రాష్ట్ర ఎన్నికల పరిశీలకుల బృందం ఆకస్మికంగా సందర్శించింది. పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలపై ఆరా తీసింది.
పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లపై ఆకస్మిక తనిఖీ
మధిర నియోజకవర్గంలో మొత్తం 2,10,358 మంది ఓటర్లున్నారు. వీరి కోసం మధిర, ముదిగొండ, చింతకాని, ఎర్రుపాలెం, బోనకల్ మండలాల్లో మొత్తం 255 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లో ఓటర్లకోసం ఏర్పాటు చేసిన వసతులపై పరిశీలకుల బృంద సభ్యులు తనిఖీ చేశారు. వికలాంగులు, వృద్ధుల కోసం చేసిన ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. ఇతర ఏర్పాట్లపై తహసీల్దారు, రెవెన్యూ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
ఇదీ చదవండి: 'పార్టీ గుర్తేంటో తెలియని అభ్యర్థి నాపై పోటీయా'