Police seized illegal marijuana: ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి జిల్లా మోతుగూడెం నుండి చెన్నై తరలిస్తున్న 594 కిలోల గంజాయిని భద్రాచలం జిల్లా సారపాక వద్ద పోలీసులు పట్టుకున్నారు. ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులని చూసి రెండు కార్లలో వస్తున్న ఇద్దరు యువకులు పారిపోగా సారపాకకు చెందిన అన్వేష్‌ని పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని కొందరు వ్యక్తుల నుంచి గంజాయిని కొనుగోలు చేసి చెన్నైకి చెందిన వ్యాపారికి అప్పగించడానికి తీసుకెళ్తున్నట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. పట్టుకున్న గంజాయి విలువ సుమారుగా కోటి 19లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి రెండు కార్లు స్వాధీనం చేసుకున్నారు.