తెలంగాణ

telangana

ETV Bharat / state

పాత దుకాణాదారులపై పోలీసుల జులుం - POLICE OVER ACTION ON OLD SHOP KEEPERS

ఖమ్మం ఇందిరానగర్ దేవస్థాన సముదాయంలో దుకాణాదారులను వేలం పాటలో కొందరు దక్కించుకున్నారు. దీంతో అధికారులు పాతవాళ్లను ఖాళీ చేయాలని చెప్పగా నిరాకరించారు. ఫలితంగా పోలీసులు బలవంతంగా ఖాళీ చేయించారు.

బలవంతంగా దుకాణాదారులను ఖాళీ చేయిస్తున్న పోలీసులు
బలవంతంగా దుకాణాదారులను ఖాళీ చేయిస్తున్న పోలీసులు

By

Published : Jan 4, 2020, 10:40 PM IST

ఖమ్మం జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్‌ రామాలయానికి చెందిన దుకాణాలు ఖాళీలు చేయటంలో ఉద్రిక్తత నెలకొంది. పదేళ్లుగా దుకాణాలు నడుపుతున్న వ్యాపారులకు... దేవస్థాన సిబ్బందికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రామాలయం మూడేళ్ల క్రితం ఎండోమెంట్‌ పరిధిలోకి వచ్చింది. ఇటీవల దుకాణాలకు వేలం వేయగా ఆ దుకాణాలను ఇతరులు దక్కించుకున్నారు. ఫలితంగా పాత వారిని ఖాళీ చేయాలని అధికారులు నోటీసులు జారీ చేశారు.

పాత దుకాణాదారులు మాత్రం ఖాళీ చేసేందుకు నిరాకరించారు. పోలీసుల సాయంతో అధికారులు... దుకాణాలు ఖాళీ చేయించారు. వ్యాపారులు అడ్డుకోవటం వల్ల ఉద్రిక్తత చోటు చేసుకుంది. వ్యాపారులను అరెస్టు చేసి దుకాణాలను ఖాళీ చేయించారు. కేసు కోర్టులో ఉందని... బలవంతంగా అధికారులు ఖాళీ చేయిస్తున్నారని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారమే ఖాళీ చేయిస్తున్నామని దేవాదాయ శాఖ అధికారులు చెబుతున్నారు.

బలవంతంగా దుకాణాదారులను ఖాళీ చేయిస్తున్న పోలీసులు

ఇవీ చూడండి : 'ఇద్దరు భార్యలూ ఒకేసారి గెలిస్తే.. ఆ కిక్కే వేరప్పా!'

ABOUT THE AUTHOR

...view details