ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం సింగరేణిలో పంచాయతీ నిధుల దుర్వినియోగంపై ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ విషయంపై కొన్నాళ్లుగా వివాదం కొనసాగుతోంది. రూ.22 లక్షలు దుర్వినియోగమైనట్టు అధికారులు తేల్చారు. దీనిపై గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పంచాయతీలో అవినీతిపై దీక్ష.. భగ్నం చేసేందుకు పోలీసుల యత్నం - సింగరేణిలో దీక్ష భగ్నానికి పోలీసుల యత్నం
ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం సింగరేణిలో నిధుల దుర్వినియోగంలో భాధ్యులపై చర్యలు తీసుకోవాలని తెరాస నేత దీక్ష చేపట్టారు. దీక్ష భగ్నం చేసేందుకు యత్నించిన పోలీసులను గ్రామస్థులు అడ్డుకున్నారు.
దీక్ష భగ్నానికి పోలీసుల యత్నం.. అడ్డుకున్న గ్రామస్థులు
బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ... తెరాస నేత సత్యనారాయణ దీక్ష చేపట్టారు. ఆరో రోజుకు చేరిన దీక్షను భగ్నం చేసేందుకు పోలీసులు యత్నించారు. పోలీసులను సింగరేణి గ్రామస్థులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, స్థానికులకు మధ్య వాగ్వాదం జరిగింది.
ఇదీ చూడండి:నిధుల దుర్వినియోగంపై తెరాస నాయకుడు ఆమరణ నిరాహార దీక్ష
TAGGED:
సింగరేణిలో సత్యనారాయణ దీక్ష