తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎస్సీ రుణాలపై విచారణ - ఎస్సీ రుణాలు

ఖమ్మం జిల్లాలో ఎస్సీ రుణాలు పక్కదారి పట్టాయంటూ లబ్ధిదారులు చేసిన ఆందోళనలకు ఉన్నతాధికారులు స్పందించారు.  రంగంలోకి దిగిన పోలీసులు విచారణ జరిపారు.

పోలీసులు

By

Published : Feb 28, 2019, 5:32 PM IST

ఎస్సీ రుణాల అవకతవకలపై విచారణ
ఎస్సీ కార్పొరేషన్​ రుణాల కేటాయింపులో అవినీతి జరిగిందన్న ఆరోపణలపై ఖమ్మం జిల్లా సంక్షేమ భవన్​లో పోలీసులు విచారణ జరిపారు. ఎవరెవరు దరఖాస్తు చేసుకున్నారు.. ఎవరెవరికి ఎంత రుణం మంజూరు చేశారనే వివరాలు సేకరించారు. 2016-17 సంవత్సరానికి గానూ 178 లబ్ధిదారులకు రుణాలను సంక్షేమ శాఖ మంజూరు చేసింది. మధ్యవర్తులు, దళారులు, అధికారులు కుమ్మక్కై.. నిధులు తమకు అందకుండా చేశారని గత కొద్ది రోజులుగా బాధితులు ఆ శాఖ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహిస్తున్నారు.

మీడియాలో కథనాలు

లబ్ధిదారుల ఆందోళనపై వచ్చిన కథనాలకు స్పందించిన ఉన్నతాధికారులు విచారణకు ఆదేశాలు జారీ చేశారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి నివేదికను అందిస్తామని పోలీసులు తెలిపారు.

ఇవీ చదవండి :కూల్చేస్తాం జాగ్రత్త!

ABOUT THE AUTHOR

...view details