కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్లో భాగంగా సడలింపులు ఇవ్వటం వల్ల కొంత మంది వలస కూలీలు మహారాష్ట్ర నుంచి స్వగ్రామమైన ఖమ్మం జిల్లా మధిర మండలం మహాదేవపురం గ్రామానికి వచ్చారు. వారిలో ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా తేలింది. అప్రమత్తమైన పోలీసులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సదరు వ్యక్తిని చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అతని కుటుంబ సభ్యులతో పాటు గ్రామానికి చెందిన మొత్తం 52 మందిని క్వారంటైన్‌కు తరలించారు.
'కరోనాపై అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలే' - false News in Social media campaigns on Corona
కరోనా వైరస్ కలవరపెడుతున్న వేళ సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారం, అసత్య ప్రచారం వెల్లువెత్తుతోంది. వివిధ రూపాల్లో తమ కొస్తున్న సందేశాల్లోని సారాంశం నిజమా? కాదా? అనేది నిర్ధారించుకోకుండానే చాలా మంది షేరు చేస్తున్నారు. కరోనా వైరస్‌పై సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మధిర సీఐ వేణు మాధవ్ హెచ్చరించారు.
'కరోనాపై అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలే'
అయితే సామాజిక మాధ్యమాల ద్వారా కొంతమంది గ్రామంలో మొత్తం ఏడు, ఎనిమిది మందికి పైగా కరోనా సోకినట్లు... మధిర ప్రాంతాన్ని రెడ్ జోన్‌గా చేసినట్లు దుష్ప్రచారం చేశారు. విషయం తెలుసుకున్న మధిర సీఐ వేణుమాధవ్, పట్టణ ఎస్సై ఉదయ్ కుమార్‌తో గ్రామానికి వెళ్లి ఎవరూ భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదని మనోధైర్యం కల్పించారు. సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలు చేసేవారిని చట్టరీత్యా శిక్షిస్తామని హెచ్చరించారు.
Last Updated : May 20, 2020, 1:18 PM IST