కొవిడ్ నిబంధనలకు విరుద్ధంగా ఖమ్మం జిల్లా కొణిజర్లలో ఆలయ ప్రతిష్ఠ నిర్వహించిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కొణిజర్ల గ్రామంలో శ్రీ మహాదేవ లింగేశ్వరస్వామి శిఖర, విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాన్ని అనుమతులు లేకుండా జరిపారని పోలీసులు వెల్లడించారు. లాక్డౌన్ మార్గదర్శకాలు గాలికొదిలేసి అధిక సంఖ్యలో తరలివచ్చారన్న ఆరోపణలపై జిల్లా పోలీసు సూపరింటెండెంట్ విష్ణు యస్ వారియర్ ఆదేశాలు జారీ చేశారు. నిర్వహణ కమిటీకి చెందిన 19 మందిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
కొణిజర్లలో ఆలయ ప్రతిష్ఠ.. 19మందిపై కేసు నమోదు
కొణిజర్లలో ఆలయ ప్రతిష్ఠ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆలయ నిర్వహణ కమిటీకి చెందిన 19 మందిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఈ వేడుకలను నియంత్రించడంలో విఫలమైన పోలీసులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
కొణిజర్లలో ఆలయ ప్రతిష్ఠం, కొణిజర్ల ఆలయ వేడుకలపై కేసు నమోదు
ప్రజలు అధిక సంఖ్యలో రావడాన్ని నియంత్రించడంలో విఫలమైన కొణిజర్ల ఎస్సై, వైరా సీఐ, ముందస్తు సమాచారం సేకరణలో విఫలమైన స్పెషల్ బ్రాంచ్ ఏఎస్సైకు శాఖాపరమైన క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఛార్జ్ మెమో జారీ చేశారు. ఈ ఘటనలపై వివరణ ఇవ్వాల్సిందిగా వైరా ఏసీపీని పోలీస్ కమిషనర్ ఆదేశించారు.
ఇదీ చదవండి:పీడీఎఫ్ రూపంలో ఇంటర్ పాఠ్యాంశాలు