తెలంగాణ

telangana

ETV Bharat / state

గిరిజనులకు పోలీసు శాఖ అండగా ఉంటుంది: సీపీ - ఖమ్మం జిల్లా తాజా వార్తలు

అటవీ ప్రాంతంలో నివసిస్తున్న గుత్తి కోయలకు పోలీసు శాఖ అండగా ఉంటుందని... ఖమ్మం సీపీ తఫ్సీర్ ఇక్బాల్ తెలిపారు. ఏన్కూర్​లో పోలీసు శాఖ ఆధ్వర్యంలో గుత్తి కోయ కుటుంబాల కోసం ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.

Police Department conduct Mega medical camp for Tribals in khammam district
గిరిజనులకు పోలీసు శాఖ అండగా ఉంటుంది: సీపీ

By

Published : Feb 22, 2021, 12:14 PM IST

అటవీ ప్రాంతంలో వైద్యానికి దూరంగా ఉన్న గిరిజనులను గుర్తించి ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు... ఖమ్మం సీపీ తఫ్సీర్ ఇక్బాల్ తెలిపారు. గుత్తి కోయల కుటుంబాలకు పోలీసు శాఖ అండగా ఉంటుందని అన్నారు. ఏన్కూర్​లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.

దాదాపు 350 కుటుంబాలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. గిరిజన కుటుంబాలకు నిరంతరం సాయం అందించాలని స్థానిక పోలీసులను ఆదేశించారు. వారికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. శిబిరాన్ని ఏర్పాటు చేసిన స్థానిక పోలీసు సిబ్బందిని సీపీ అభినందించారు.

గిరిజనులకు పోలీసు శాఖ అండగా ఉంటుంది: సీపీ

ఇదీ చదవండి: మాతృభాషలో బోధనతోనే నేర్పరితనం

ABOUT THE AUTHOR

...view details