తెలంగాణ

telangana

ETV Bharat / state

ఖమ్మంలో 300 కిలోల గంజాయి పట్టివేత - ఖమ్మంలో 300 కిలోల గంజాయి పట్టివేత

బిస్కెట్​ ప్యాకెట్​ డబ్బాల మధ్యలో ఉంచి... అక్రమంగా తరలిస్తున్న గంజాయిని ఖమ్మం జిల్లా పోలీసులు పట్టుకున్నారు.

police caught three hundred kilograms Cannabis in khammam
ఖమ్మంలో 300 కిలోల గంజాయి పట్టివేత

By

Published : Dec 27, 2019, 12:40 PM IST

ఖమ్మంలో 300 కిలోల గంజాయి పట్టివేత

ఖమ్మం నగరంలో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఓ కంటైనర్​లో బిస్కెట్​ ప్యాకెట్ డబ్బాల మధ్య ఉంచి తరలిస్తున్న గంజాయిని పోలీసులు గుర్తించారు. పట్టుకోవడానికి ప్రయత్నించగా.. డ్రైవర్​ వాహనంతో సహా పారిపోవడానికి ప్రయత్నించాడు. వెంటనే పోలీసులు వాహనాన్ని సినీఫక్కీలో ఛేజ్​ చేసి పట్టుకున్నారు.

కంటైనర్​లో సుమారు 300 కిలోల గంజాయి ఉన్నట్లు తెలిపారు. ఇంత భారీ మొత్తంలో గంజాయి పట్టుకోవడం ఇదే ప్రథమమని పోలీసులు వెల్లడించారు. గంజాయి తరలిస్తున్న మరో కంటైనర్​ పరారీలో ఉన్నట్లు సమాచారం.

ABOUT THE AUTHOR

...view details