బయటకు రావొద్దని దండం పెట్టారు. గుంపులుగా గుమిగూడొద్దని ప్రాధేయపడ్డారు. పగలనకా.. రాత్రనకా.. ఊరురా తిరుగుతూ బతిమిలాడారు. చిన్న పిల్లలను బుజ్జగిజ్జినట్లు మెత్తగా చెప్పారు పోలీసులు. అయినా ఆ మాటలు పెడచెవిన పెట్టి ఇష్టార్యాజ్యంగా తిరుగుతున్నారు కొందరు. ఇలా నిర్లక్ష్యంగా ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పోచారంలో కొంతమంది యువత క్రికెట్ ఆడారు.
యువకుడి నిర్లక్ష్య బౌలింగ్‌కు పోలీసు లాఠీ సిక్స్ - యువకుడిని కొట్టిన పోలీసు
కరోనాను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. బయటకు ఎవరూ రాకుండా ఉండేందుకు పోలీసులు కలియ తిరుగుతున్నారు. అయినా కొందరూ అవేవి పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇలా సామాజిక బాధ్యతలేని ఓ యువకుడికి ఓ పోలీసు ఎలా బుద్ధి చెప్పాడో చూడండి.
యువకుడి నిర్లక్ష్య బౌలింగ్‌కు పోలీసు లాఠీ సిక్స్
అది తెలుసుకున్న పోలీసులు క్రికెట్ ఆడుతున్న మైదానానికి వెళ్లి తమ లాఠీ ఝళిపించారు. పాఠశాలలో మాష్టారు అడిగిన పాఠం అప్పజెప్పని విద్యార్థిని కొట్టినట్లుగా బుద్ధి చెప్పాడో ఓ పోలీసు. ఆ దెబ్బలకు చిన్నప్పటి కూడా గుర్తొచ్చి ఉంటాయి. తన తప్పు తెలుసుకొని ఇంకోసారి అలా బయటకు రానని.. ఇంట్లోనే ఉంటానని చెప్పి పరుగు పెట్టాడు.