ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని తనగంపాడులో రూ. 20 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి ప్రారంభించారు. 30 రోజుల ప్రత్యేక ప్రణాళికలో ప్రతి ఒక్కరు పాల్గొని గ్రామాభివృద్ధికి తోడ్పడాలని ఎమ్మెల్యే సూచించారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకుంటూ... మొక్కలు నాటి పర్యవరణాన్ని కాపాడుకోవాలన్నారు. భక్తరామదాసు ప్రాజెక్టు ద్వారా తనగంపాడుకు నీరు చేరవేస్తామని హామీ ఇచ్చారు. రైతులు నీటిని పొదుపుగా వాడుకోవాలన్నారు. రాష్ట్రంలో యూరియా కొరత లేదని... రైతులు ఆందోళన పడొద్దని వివరించారు.
మొక్కలు నాటాలి... పర్యావరణాన్ని రక్షించాలి... - మొక్కలు నాటాలి... పర్యావరణాన్ని రక్షించాలి...
ఖమ్మం జిల్లాలోని తనగంపాడులో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే ఉపేందర్‌రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా రైతులకు 30 రోజుల ప్రత్యేక ప్రణాళికను వివరించి పలు సూచనలు చేశారు.

Plant plants ... protect the environment ..
TAGGED:
gramapanchayatee-prarbam