Pigeon Created A Stir In Khammam District: తెలంగాణకు ఆనుకుని ఉన్న సరిహద్దు ప్రాంతమైన ఆంధ్రప్రదేశ్లో ఒక పావురం కలకలం రేపింది. అల్లూరి సీతారామరాజు జిల్లా యటపాక మండలం గొల్లగూడెం గ్రామంలో ఒక పావురం ప్రత్యక్షమైంది. గోదావరి ఒడ్డున ఉండే మత్స్యకార కుటుంబ సభ్యులకు ఈ పావురం కనపడింది. పావురానికి ట్యాగ్ కట్టి ఉండటంతో స్థానికులను ఆందోళనకు గురయ్యారు.
Pigeon Created A Stir In Gollagudem Village: దీంతో ఆ గ్రామంలో రకరకాల ఊహాగానాలు వెల్లవెత్తాయి. ఈ పావురం దొరికిన విషయాన్ని మత్యకారులు పోలీసులకు తెలిపారు. దీనిపై పోలీసు అధికారులు విచారణ చేపట్టారు. ఆయితే పావురానికి జీపీయస్ వంటి ట్యాగ్ కట్టి ఉండటంతో ఈ విషయం స్థానికంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇంటి మీదకి పావురం వచ్చిందని, దానిని పట్టుకొని చూస్తే ఒక కాలుకి ట్యాగ్ వేసి ఉందని మత్స్యకారులు తెలిపారు.
ఇది ఇలా ఉండగా, అన్ని రకాల పందేల మాదిరిగానే ఇటీవలే పావురాల పెందేలను నిర్వహించటం సాదారణంగా మారింది. పావురాలకు ముందుగానే శిక్షణ ఇస్తారు. పూర్తి శిక్షణ ఇచ్చాకా, దానిని పందేలలోకి దించుతారు. రూ.కోట్లల్లో చేతులు మారే ఈ పందేలలో భాగంగా పావురాల కాళ్లకు ట్యాగ్లు కట్టి వీటిని గుంపులు గుంపులుగా వదులుతారు.