తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా వైరస్ కు.. భౌతిక దూరమే దివ్యఔషధం..! - ఖమ్మం జిల్లా వైరాలో నిత్యావసరాల పంపిణీ

కరోనా వైరస్ కు వ్యాక్సిన్ రాలేదని.. భౌతిక దూరమే మనముుందున్న దివ్యఔషధమని ఎమ్మెల్యే రాములునాయక్ అన్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న పేదలకు.. ఖమ్మం జిల్లా వైరాలోని తన క్యాంపు కార్యాలయంలో నిత్యావసరాలు పంపిణీ చేశారు.

Physical distance to corona virus Medicine
కరోనా వైరస్ కు.. భౌతిక దూరమే దివ్యఔషధం..!

By

Published : May 21, 2020, 11:07 AM IST

లాక్‌డౌన్‌ నేపథ్యంలో.. ఇబ్బందులు పడుతున్న పేదలకు ఎమ్మెల్యే రాములునాయక్‌ నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. ఖమ్మం జిల్లా వైరాలోని క్యాంపు కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. కరోనా వైరస్‌ అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తున్నట్లు పేర్కొన్నారు.

కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టే విధంగా.. సీఎం అధికార యంత్రాంగానికి మార్గదర్శకాలు అందించారని ఎమ్మెల్యే తెలిపారు. లాక్‌డౌన్‌ ముగిసే వరకు నిబంధనలు పాటించాలని, మాస్కులు కచ్చితంగా ధరించాలని సూచించారు.

ఇదీ చూడండి:దూరంగా బెంచీలు... సగంమందే విద్యార్థులు

ABOUT THE AUTHOR

...view details