తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనాలు అమలు చేయాలని ఖమ్మం జిల్లా వైరా, సత్తుపల్లి నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలకు అర్చకులు వినతి పత్రాలు అందజేశారు. ఏన్కూర్‌లో వైరా ఎమ్మెల్యే రాములు నాయక్‌కు అర్చకులు తమ సమస్యలను వివరించారు. తల్లాడలో అర్చక బృందం సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు వినతి పత్రం అందజేశారు.
ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి.. ఎమ్మెల్యేలకు అర్చకుల వినతి - petition by priests at khammam latest
తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ దేవాలయాల్లో పనిచేస్తున్న అర్చకులు ఖమ్మం జిల్లా వైరా, సత్తుపల్లి నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు అందజేశారు. అర్చకులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనాలు అమలు చేయాలని కోరారు.
'ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనాలు అమలు చేయాలి'
దూప దీప నైవేద్యం, గౌరవ వేతనంతో కుటుంబాలు గడవక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి.. తమకు ఆరోగ్యకార్డులు, రెండు పడక గదుల ఇల్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యేలు స్పందించి తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలన్నారు.