సిద్దిపేటలో ఐటీ టవర్ నిర్మాణానికి పరిపాలనా అనుమతులు మంజూరయ్యాయి. 60వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో... 45కోట్లతో నిర్మాణం చేపట్టనున్నారు. సిద్దిపేట పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్.. ఐటీ టవర్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.
సిద్దిపేటలో ఐటీ టవర్ నిర్మాణానికి అనుమతులు మంజూరు - Siddipet district news
సిద్దిపేటలో 60 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐటీ టవర్ నిర్మాణానికి పరిపాలన అనుమతులు మంజూరయ్యాయి. ఈనెల 10న ఐటీ టవర్ నిర్మాణానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు.
సిద్దిపేటలో ఐటీ టవర్ నిర్మాణానికి అనుమతులు మంజూరు
సీఎం సమక్షంలో ఇన్ఫోసిస్ సహా పలు సంస్థలతో ఐటీశాఖ అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోనుంది. జిల్లాకు ఐటీ టవర్ మంజూరు పట్ల హర్షం వ్యక్తం చేసిన మంత్రి హరీశ్ రావు... స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి: భారత్ బంద్కు కేసీఆర్ సంపూర్ణ మద్దతు