తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా పరీక్షల కోసం బారులుతీరిన ఖమ్మం వాసులు - khammam district news

కార్పొరేషన్ ఎన్నికలు ముగిసిన మరుసటి రోజే కరోనా పరీక్షల కోసం నగర వాసులు బారులు తీరారు. ఖమ్మం నగరంలో కరోనా పరీక్షలు చేయించుకునేందుకు నగరవాసులు భారీగా తరలి వచ్చారు.

lined up for corona tests
కరోనా పరీక్షల కోసం బారులుతీరిన నగరవాసులు

By

Published : May 1, 2021, 3:23 PM IST

ఖమ్మంలో కార్పొరేషన్ ఎన్నికలు ముగిసిన మరుసటి రోజే కరోనా పరీక్షల కోసం నగర వాసులు బారులు తీరారు. పాత బస్టాండ్ ఆవరణలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొవిడ్‌ పరీక్షా కేంద్రానికి జనం భారీగా తరలివచ్చారు. వైరస్‌ నిర్ధరణ పరీక్షల కోసం వందల మంది ఎదురుచూస్తున్నారు.

గంటల తరబడి క్యూలైన్లలో ఉండాల్సి వస్తోందని నగరవాసులు వాపోతున్నారు. ఎంతకీ పరీక్షలు చేయించుకునే అవకాశం రావడం లేదని సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. మూడు పోలీస్‌ స్టేషన్‌ల పరిధిలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఖమ్మం ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

కరోనా పరీక్షల కోసం బారులుతీరిన నగరవాసులు

ఇదీ చదవండి: వాస్తవాలన్నీ బయటకు రావాలి: ఈటల రాజేందర్​

ABOUT THE AUTHOR

...view details