ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం తనికెళ్లకు తుప్పతి నాగమణి, చంద్రశేఖర్ దంపతులకు నవ్యశ్రీ, నవదీప్ సంతానం. కూతురు ముద్దుముద్దు మాటలు..ఆమె నవ్వులు చూసి ఇంటిల్లిపాది మురిసిపోయేవాళ్లు.
జ్ఞాపకాలే... గునపాలై...
వారి సంతోషాన్ని చూసి విధికి కన్నుకుట్టిందేమో నవ్యశ్రీని గతేడాది ఆగష్టులో డెంగ్యూ జ్వరం మింగేసింది. ఆ ఇంటి దీపాన్ని ఆర్పేసి వారి జీవితాల్లో చీకట్లను నింపేసింది. ఇంటాబయటా... ఏ మూల చూసినా ప్రాణానికి ప్రాణమైన తమ కూతురి జ్ఞాపకాలే పలకరించటం... కళ్లలో పెట్టుకుని చూసుకున్న తమ ప్రతిరూపం తిరిగిరాదనే చేదు నిజం ఆ దంపతులను తీవ్రంగా కలచివేసింది. నవ్యశ్రీ దూరమై ఆరు నెలలు గడిచినా మర్చిపోలేకపోయారు.
భర్త బలవన్మరణం..భార్య పరిస్థితి విషమం..
తీవ్ర మనోవ్యథకు గురైన తల్లి నాగమణి ఈ నెల 3న ఇంట్లో ఎవరూ లేని సమయంలో గుళికల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. ఖమ్మంలోని ప్రైవేటు ఆసుపత్రిలో ప్రాణాలతో కోట్టుమిట్టాడుతోంది. కూతురు దూరమైందన్న బాధ నుంచి తేరుకోకముందే... భార్యను ఆ స్థితిలో చూసి చంద్రశేఖర్ కుంగిపోయాడు. తీవ్ర మనస్తాపంతో పొలంలో చెట్టుకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.. బంధువులకు ఫోన్ చేసి... తన కొడుకును జాగ్రత్తగా చూసుకోండని కోరాడు. అనుమానం వచ్చిన బంధువులు అంతా వెతకగా... పొలంలో విగతజీవిగా కనిపించాడు.
అనాథగా మిగిలిన బాలుడు...
చంద్రశేఖర్ మృతి, నాగమణి విషమ పరిస్థితితో కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. తట్టుకోలేని బాధతో బలహీన క్షణాల్లో తప్పుడు నిర్ణయాలు తీసుకుని... తిరిగిరాని కూతురు కోసం బతికి ఉన్న కొడుకును అనాథగా వదిలేయటం అందరినీ కలచివేసింది.
కూతురు లేదని మనోవేదన..తండ్రి బలవన్మరణం..తల్లి పరిస్థితి విషమం ఇవీ చూడండి:మేడారంలో అపశృతి.. మూర్ఛవ్యాధితో ఇద్దరి దుర్మరణం