ఖమ్మం జిల్లాలోని ఓ ప్రైవేటు ఏజెన్సీలో పనిచేస్తున్న వెంకన్న అనే ఉద్యోగి.. బ్యాంకులో జమ చేయాల్సిన రూ. 30 లక్షల నగదుతో ఉడాయించాడు. అనంతరం ఫోను స్విచ్ఛాఫ్ చేసుకుని అజ్ఞాతంలోకి వెళ్లాడు. ఈ మేరకు బ్యాంక్ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఖమ్మంలోని సీఐఎస్సీవో అనే ఓ ప్రైవేటు ఏజెన్సీలో వెంకన్న పదేళ్లుగా పని చేస్తున్నాడు. ఏజెన్సీ ఉద్యోగులు బ్యాంకుల్లో నగదు తీసుకుని ఏటీఎంలలో పెట్టడం.. ఒక బ్యాంకు నుంచి మరొక బ్యాంకుకు నగదును తరలించడం అతని పని.
ఈనెల 11న నిందితుడు వెంకన్న.. గాంధీ చౌక్‌లోని హెచ్డీఎఫ్సీ బ్యాంకుకు వెళ్లి.. వైరా రోడ్డులోని ప్రధాన బ్రాంచ్‌వారు రూ. 30 లక్షలు తీసుకురమ్మన్నారని వోచర్ చూపించాడు. ఫలితంగా వాళ్లు వెంకన్నకు రూ. 30 లక్షలు అందజేశారు.
సాయంత్రం బ్యాంకు మూసివేసే సమయంలో లెక్కలు చూస్తుండగా.. ప్రధాన బ్రాంచ్‌కి డబ్బులు చేరలేదని అధికారులు గుర్తించారు. ఇదే విషయమై నిందితుడికి ఫోన్ చేస్తే.. స్విచ్ఛాఫ్ వచ్చింది. వెంటనే విషయాన్ని పైఅధికారులకు తెలిపారు. ఇవాళ బ్యాంకు మేనేజర్ వెంకట కృష్ణారావు మూడో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
బ్యాంకు డబ్బులతో పరార్.. పోలీసులకు ఫిర్యాదు ఇదీ చూడండి :మంత్రి గారి చేతి కడియం కొట్టాశారు!