రైతన్నలకు నష్టాలు మిగులుస్తున్న అకాల వర్షం - papaya
కష్టపడి పెంచిన పంటలు అకాల వర్షాలకు దెబ్బతిన్నాయి. చేతి కొస్తుందనుకున్న మామిడి, బొప్పాయిలు నేల రాలి రైతన్నలను నష్టాల్లో ముంచాయి.

నష్టాలు మిగులుస్తున్న అకాల వర్షం
అకాల వర్షానికి ఖమ్మం నియోజకవర్గంలో పంటలు దెబ్బతిన్నాయి. రఘునాధపాలెం మండలంలో బొప్పాయి, మామిడి తోటల్లో కాయలు రాలి రైతన్నను కంటతడి పెట్టిస్తున్నాయి. మల్లేపల్లి పంచాయతీ పరిధిలోని బొప్పాయి చెట్లు ఈదురు గాలులకు విరిగిపోయాయి. చేతికొచ్చిన పంట నేల రాలటంతో రైతులు బాగా నష్టపోయారు.
నష్టాలు మిగులుస్తున్న అకాల వర్షం