రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అండగా నిలవాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు విజ్ఞప్తి చేశారు. ఖమ్మంలోని సప్తపది ఫంక్షన్ హల్లో జరిగిన వెలమ కులస్థుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి అజయ్‌కుమార్‌తో కలిసి పాల్గొన్నారు.
అభివృద్ధిని చూసి ఓటేయండి: ఎర్రబెల్లి దయాకర్‌రావు - Errabelli Dayakar election campaign
రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని చూసి పట్టభద్రులు ఓటేయాలని పంచాయతీరాజ్ శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కోరారు. ఖమ్మంలో జరిగిన వెలమ కులస్థుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి అజయ్‌కుమార్‌తో కలిసి పాల్గొన్నారు. తెరాస పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి తొలి ప్రాధాన్యత ఓటు వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
అభివృద్ధిని చూసి ఓటేయండి: ఎర్రబెల్లి దయాకర్‌రావు
అన్ని కులాలతో పాటు వెలమ కులానికి కేసీఆర్ స్థలం కేటాయించి పిల్లల చదువుకు ప్రత్యేక భవనం నిర్మిస్తున్నారన్నారు. మొదటి నుంచి గ్రామాల్లో సేవా దృక్పథం ఉన్న వెలమలు... కేసీఆర్ గౌరవం పెంచే విధంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాసకు మంచి మెజారిటీ వచ్చేలా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి:టీఎంసీXభాజపా: బరిలో ఇద్దరు మాజీ ఐపీఎస్‌లు!