తెలంగాణ

telangana

ETV Bharat / state

రైతు సంక్షేమమే కేసీఆర్ లక్ష్యం: ఎమ్మెల్యే కందాల

రైతులు కష్టపడి పంటలు పండించి అధిక దిగుబడితో పాటు లాభాలు పొందాలని పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్​ రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా చేగొమ్మ గ్రామంలో ఖమ్మం సహకారం సంఘం సొసైటీ ఆధ్వర్యంలో రైతులకు ఎరువులు పంపిణీ చేశారు.

paleru mla upender reddy  distributes fertilizers to farmers in khammam district
రైతులకు ఎరువులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

By

Published : Jun 30, 2020, 1:04 PM IST

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి మండలం చేగొమ్మ గ్రామంలో ఖమ్మం సహకార సంఘం సొసైటీ ఆధ్వర్యంలో వ్యవసాయానికి ఉపయోగపడే ఎరువులను స్థానిక ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి రైతులకు పంపిణీ చేశారు. రైతులందరూ సహకార సంఘాల ద్వారా ప్రభుత్వం పంపిణీ చేసే ఎరువులు తీసుకొని పంటలు బాగా పండించాలని ఎమ్మెల్యే అన్నారు. ప్రైవేటు దుకాణాల్లోని ఎరువుల కంటే సహకార సంఘాల ద్వారా పంపిణీ చేసే ఎరువులు తక్కువ ధరకు లభ్యమవుతాయని ఆయన అన్నారు.

ప్రభుత్వం సూచించిన విధంగా పంటలు పండించి అధిక లాభాలు పొందాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిందని ఎమ్మెల్యే వెల్లడించారు. పండించిన పంటను కూడా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని అన్నారు. రైతులందరూ కష్టపడి పంట పండించి అధిక దిగుబడి సాధించాలని ఎమ్మెల్యే ఉపేందర్​రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ఛైర్మన్ శేఖర్, వ్యవసాయ అధికారి రవిచంద్ర పాల్గొన్నారు.


ఇవీ చూడండి: పరిశ్రమలకు తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ అండ

ABOUT THE AUTHOR

...view details