తెలంగాణ

telangana

ETV Bharat / state

వీఆర్ఏలు జీవితంలో మర్చిపోలేని కానుకలు ఇచ్చారు: ఎమ్మెల్యే సండ్ర - ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య వార్తలు

ముఖ్యమంత్రి కేసీఆర్​ను వీఆర్ఏలు జీవితంలో మర్చిపోలేని కానుకలు ఇచ్చారని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. పెనుబల్లి తహసీల్దార్ కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషకం చేసిన వీఆర్​ఏలు.. ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యను ఘనంగా సన్మానించారు.

palabhishekam-to-cm-kcr-photo-at-penuballi-in-khammam-district
వీఆర్ఏలు జీవితంలో మర్చిపోలేని కానుకలు ఇచ్చారు: ఎమ్మెల్యే సండ్ర

By

Published : Sep 17, 2020, 9:01 PM IST

గతంలో రకరకాల పేర్లతో ఉన్న గ్రామ సేవకున్ని వీఆర్ఏలుగా పేరు మార్చి ఆరువేల వేతనాన్ని పదివేలకు పెంచిన గొప్ప వ్యక్తి కేసీఆర్ అని​ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. రాష్ట్రానికి రూ. 250 కోట్లు ఆర్థిక భరమైనప్పటికీ అర్హత కలిగిన వారికి పదోన్నతులు కల్పించేందుకు కేసీఆర్​ కృషి చేస్తున్నరని.. ఇలా వీఆర్ఏలు జీవితంలో మర్చిపోలేని కానుకలు ఇచ్చారని ఎమ్మెల్యే అన్నారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి తహసీల్దార్ కార్యాలయంలో మండల పరధిలోని వీఆర్ఏలు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు.

స్థానిక పంచాయితీ కార్మికుల సమస్యలను పంచాయతీరాజ్ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. మిషన్ భగీరథలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించడం వల్ల ఎమ్మెల్యేను కలసి కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు, పలువురు నాయకులు, ఇతరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:కారును వెనుక నుంచి డీసీఎం ఢీ.. అదుపుతప్పి వాగులో బోల్తా

ABOUT THE AUTHOR

...view details