'మన గాలి..మన ఆక్సిజన్' అనే నినాదంతో ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో రూ. 90 లక్షలతో చేపట్టిన ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాన్ని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు.
125 సిలిండర్ల ఉత్పత్తి సామర్థ్యంతో ఆక్సిజన్ ప్లాంట్
ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఆక్సిజన్ ఉత్పత్రి కేంద్రాన్ని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ప్రారంభించారు. కరోనా రెండో దశ విజృంభిస్తున్న సమయంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు.
ఆస్పత్రిలో గతేడాది ఆక్సిజన్ సిలిండర్‌ను ఏర్పాటు చేయగా.. ఇప్పటి వరకు హైదరాబాద్ నుంచే అక్కడికి ప్రాణవాయువు సరఫరా అవుతోంది. ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్నందునందున ఆస్పత్రిలోనే ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేయాలనే మంత్రి ఆదేశాల మేరకు వైద్యాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్లాంట్ ద్వారా ప్రతి రోజూ 125 సిలిండర్ల ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుందని తెలిపారు. ఈ కేంద్రం ఏర్పాటుతో ఆస్పత్రిలో ఇకపై ఆక్సీజన్ సమస్య ఉండదని మంత్రి వెల్లడించారు.
ఇదీ చదవండి:మనకు తెలియకుండానే కరోనా వచ్చి వెళ్తోందట!