ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని మల్లారం, జలిముడి గ్రామాల మధ్య పంటకాలవ పొంగిపొర్లుతోంది. రాత్రి నుంచి కురిసిన భారీ వర్షానికి ఎగువ ప్రాంతాల నుంచి నీరు వచ్చి చేరడం వల్ల పంటకాలవ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.
పొంగిపొర్లుతున్న పంటకాలవ.. నీటమునిగిన పంటపొలాలు - పొంగిపొర్లుతున్న పంటకాలువ తాజా వార్త
ఖమ్మం జిల్లాలో రాత్రి కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాల్లోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మల్లారం, జలిముడి గ్రామాల మధ్య పంటకాలవ ఉద్ధృతంగా ప్రవహించడం వల్ల వాహనరాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
పొంగిపొర్లుతున్న పంటకాలవ.. నీటమునిగిన పంటపొలాలు
ఫలితంగా రెండు గ్రామాల మధ్య ఉన్న రహదారిపైకి భారీగా నీరు చేరి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరదనీటితో సమీపంలోని పంటపొలాలు నీటమునిగాయి.
ఇదీ చూడండి:రాష్ట్రంలో పలుచోట్ల ఉదయం నుంచి ఎడతెరిపి లేని వర్షాలు
TAGGED:
over floating of pantakaluva