తెలంగాణ

telangana

ETV Bharat / state

హరితవనం ఏర్పాటు వ్యతిరేకిస్తూ... సీపీఎం ఆందోళన - cpm news

ఎస్టీ, బీసీలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు ఆక్రమించి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో హరితవనం ఏర్పాటును సీపీఎం వ్యతిరేకించింది. ఖమ్మం జిల్లాలోని దెందూకూరులో నిరాహార దీక్షలు చేపట్టింది.

Opposing the establishment of Haritavanam CPM concern at khammam
Opposing the establishment of Haritavanam CPM concern at khammam

By

Published : Sep 17, 2020, 3:06 PM IST

ఖమ్మం జిల్లా మధిర మండలం దెందుకూరులో ఎస్టీ, బీసీలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు ఆక్రమించి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో హరితవనం ఏర్పాటును వ్యతిరేకిస్తూ... సీపీఎం ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు చేపట్టారు.

ఈ ప్రాంతంలో లెవెన్​ కేవీ విద్యుత్​ తీగలు ఉండటం వల్ల హరితవనం ఏర్పాటు చేసిన ప్రయోజనం ఉండదని సీపీఎం నాయకులు పేర్కొన్నారు. అధికారులు పట్టుబట్టి హరితవనం ఇక్కడ ఏర్పాటు చేస్తే.. ఇళ్ల స్థలాలు కోల్పోయిన పేదలందరికీ వేరే చోట స్థలాలు చూపాలని డిమాండ్​ చేశారు.

ABOUT THE AUTHOR

...view details