ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కేంద్రంలోని ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పదో తరగతి విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఆఫీస్ రూమ్‌కి పిలిపించుకొని వారి శరీర భాగాలను తాకినట్లు పిల్లల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు బెజవాడ శంకర్ రెడ్డిపై పోస్కో చట్టం కింద కేసు నమోదైంది. అప్పటి నుంచి పరారీలో ఉన్న శంకర్ రెడ్డిని ఈ రోజు పోలీసులు పట్టుకున్నారు. గతంలో తిరుమలాయపాలెం మండలం తేట్టెల పాడు పాఠశాలలో ఇలాగే ప్రవర్తించాడని పోలీసులు తెలిపారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు.
విద్యార్థినులతో అసభ్య ప్రవర్తన.. కటకటాల్లో కీచక టీచర్ - TEACHER
విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఓ ఉపాధ్యాయుడే పిల్లల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు.
పాఠాలు చెప్పాల్సిన వాడే చిన్నారులపై కన్నేస్తున్నాడు