చింతకాని- కొణిజర్ల రహదారిపై మృతదేహంతో గ్రామస్థులు రాస్తారోకో చేశారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం రెడ్డిగూడెంలో విద్యుదాఘాతంతో ఆది వర్దన్‌రెడ్డి మృతిచెందాడు. గ్రామంలోని ఓ స్తంభం వద్ద తెగిపడిన విద్యుత్ తీగలను పక్కకు నెట్టే క్రమంలో ఈ ఘటన జరిగింది. విద్యుత్‌శాఖ నిర్లక్ష్యం వల్లనే మృతిచెందాడని ఆరోపిస్తూ గ్రామస్థులు ఆందోళనకు దిగారు. మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి... గ్రామస్థుల రాస్తారోకో - విద్యుత్‌శాఖ వార్తలు
ఖమ్మం జిల్లాలో విద్యుతాఘాతంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. విద్యుత్‌శాఖ నిర్లక్ష్యంతోనే మృతి చెందాడని బంధువులు ఆరోపిస్తూ... చింతకాని-కొణిజర్ల రహదారిపై మృతదేహంతో రాస్తారోకో చేశారు.

One person died with electric shock in Khammam