ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి - khammam district news
ద్విచక్ర వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన విషాద ఘటన ఖమ్మం జిల్లా తాళ్లగూడెంలో చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
![ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి one person died in road accident in khammam district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8183325-523-8183325-1595780001379.jpg)
ద్విచక్రవాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి
ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం తాళ్లగూడెంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన తాటిపల్లి వెంకటేశ్వర్లు(55) మృతి చెందాడు. పశువులను తీసుకొస్తున్న వెంకటేశ్వర్లు ప్రధాన రహదారిపైకి వచ్చిన సమయంలో ఖమ్మం నుంచి భాగ్యనగర్ తండాకు వెళ్తున్న ద్విచక్రవాహనం ఢీకొట్టడం వల్ల అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇవీ చూడండి: కరోనాతో ఆర్టీసీ ఉద్యోగి మృతి