తెలంగాణ

telangana

ETV Bharat / state

అవ్వ గెలిచింది.. కరోనా ఓడింది! - కరోనాను గెలిచింది

కరోనా సోకుతుందేమోనన్న భయంతో ఇటీవల ఖమ్మం జిల్లాకు చెందిన ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. అయితే.. కరోనాను జయించి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది ఖమ్మం జిల్లాకు చెందిన 94 ఏళ్ల వృద్ధురాలు. సంపూర్ణ ఆరోగ్యంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయి.. మానసిక దృఢత్వం ఉంటే.. కరోనాను జయించవచ్చని నిరూపించింది.

Old Women Won On Corona In Khammam
అవ్వ గెలిచింది.. కరోనా ఓడింది!

By

Published : Aug 29, 2020, 12:42 PM IST

ఖమ్మం జిల్లా కేంద్రంలోని కమాన్‌బజార్‌కి చెందిన 94 ఏళ్ల బామ్మ కరోనాను గెలిచింది. ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రం కృష్ణా జిల్లా తిరువూరు మండలం నెమలి కొణిజర్లకు చెందిన కర్నాటి పుల్లమ్మ ఆగష్టు 15న కరోనా పాజిటివ్​తో ఖమ్మంలోని మమత ఆస్పత్రిలో చేరారు. వైద్యబృందం ఆమెకు చికిత్స చేయడం మొదలుపెట్టారు. వైద్యుల సలహా, తగు జాగ్రత్తలు పాటిస్తూ.. 15 రోజుల్లో కరోనాను జయించి ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయింది. ప్రస్తుతం పుల్లమ్మ ఆరోగ్యం బాగుందని, మానసికంగా బలంగా ఉంటూ.. ఆరోగ్యం, ఆహారం పట్ల శ్రద్ధ పెడితే కరోనాను సులువుగా జయించవచ్చని మమత ఆస్పత్రి డీఎంహెచ్‌వో డా.మాలతి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details