అయినవారు దూరమై.. ఆదరించేవారు కరవై.. - old women request to help her in khammam
విద్యాధికుల ఇంట పుట్టిన ఆమెకు వీధిఅరుగులే ఆవాసం.. అయిన వారంతా దూరమై అనాథగా బతుకునీడుస్తున్నారు. ఖమ్మం స్టేషన్ రోడ్‌లో ఓ దుకాణం ఎదుట ఉంటున్న వృద్ధురాలు దుడ్డు సుబ్బలక్ష్మి దీనగాధ ఇది. దయతలిచి ఎవరైనా ఇస్తేనే కడుపు నిండుతుంది.
![అయినవారు దూరమై.. ఆదరించేవారు కరవై.. old women request everyone to help her in khammam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6995973-33-6995973-1588218553152.jpg)
నాడు ఖమ్మం జిల్లా విద్యాశాఖాధికారిగా పనిచేసిన సూర్యనారాయణ కూతురు సుబ్బలక్ష్మి. తనకు సోదరి, ఇద్దరు సోదరులున్నారు. తల్లిదండ్రులు చనిపోయారు. తోడబుట్టిన వారు కూడా లేరు. వారి పిల్లలు ఎక్కడున్నారో తెలియదు. మామిళ్లగూడెంలో ఓ ఇంట్లో కొన్నాళ్లు అద్దెకు ఉన్నానని, తనకు ఆసరా పెన్షన్ వస్తోందని పేర్కొన్నారు. నగరంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఏ ద్వితీయ సంవత్సరం వరకు చదువుకున్నానని పేర్కొన్నారు. ఇప్పుడు అయిన వారంతా దూరమై అనాథగా బతుకునీడుస్తున్నారు. ఎవరైనా దయతలిచి ఇచ్చిన దానితోనే కడుపు నింపుకుంటున్నారు.