తెలంగాణ

telangana

ETV Bharat / state

ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం - old students meet in enkoor

ఏన్కూర్​ ఉషోదయ ఉన్నత పాఠశాలలో 2008-2009లో పదో తరగతి చదివిన విద్యార్థులు సమావేశమయ్యారు. ఉద్యోగాలు సాధించిన తోటి విద్యార్థులను ఘనంగా సన్మానించారు.

ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం

By

Published : Oct 6, 2019, 11:00 PM IST

ఖమ్మం జిల్లా ఏన్కూర్​ ఉషోదయ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. 2008-09 సంవత్సరంలో పదో తరగతి బ్యాచ్​ విద్యార్థులు అందరూ ఒక చోట చేరి సందడి చేశారు. చిన్ననాటి పాఠశాల జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నారు. పదేళ్ల తర్వాత కలుసుకున్న మిత్రులు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకొని, యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఇటీవల ఎస్సై, ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించిన వారిని ఘనంగా సన్మానించారు.

ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం

ABOUT THE AUTHOR

...view details