ఖమ్మం జిల్లా ఏన్కూరులోని తెలంగాణ గురుకుల విద్యాలయంలో 1983 నుంచి 2000 సంవత్సరం వరకు చదువుకున్న పూర్వ విద్యార్థులు సమావేశం నిర్వహించారు. ఈ గురుకులంలో చదువుకున్న విద్యార్థులు నేడు ఉన్నత స్థాయిలో ఉన్నారని.. వారంతా మళ్లీ కలిసి.. గురుకుల అభివృద్ధికి పాటు పడుతామని పూర్వ విద్యార్థి తోట సుబ్రహ్మణ్యం తెలిపారు. 1983 నుంచి 2000 సంవత్సరం వరకు గురుకులంలో చదువుకున్న వివిధ బ్యాచ్‌ల నుంచి పూర్వ విద్యార్థులు కలిసి పేద విద్యార్థులకు, తాము చదువుకున్న గురుకులం అభివృద్ధికి పాటు పడుతామని తెలిపారు.
పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక - ఖమ్మం జిల్లా వార్తలు
ఖమ్మం జిల్లా ఏన్కూరులోని తెలంగాణ గురుకుల విద్యాలయంలో చదువుకున్న పూర్వ విద్యార్థులు మళ్లీ కలిసి సమావేశం నిర్వహించారు. పూర్వ విద్యార్థుల సేవలు విస్తృతం చేసే క్రమంలో పలు బ్యాచ్‌ల ముఖ్య సభ్యులు హాజరై పలు అంశాలపై మాట్లాడారు.గురుకుల విద్యాలయం అభివృద్ధికి సహకరిస్తామని, బడికి సేవ చేస్తామని తెలిపారు.
పూర్వ విద్యార్థుల కలయిక
పేదరికం నుంచి.. ఐఆర్ఎస్ స్థాయికి ఎదిగిన గురుకులం పూర్వ విద్యార్థి సుబ్రహ్మణ్యం తన జీవిత ప్రస్థానాన్ని విద్యార్థులకు చెప్పి చైతన్య పరిచారు. తాపీ పని చేస్తూ.. వచ్చిన డబ్బులతో చదువుకున్నట్టు ఆయన తెలిపారు. ఈ అపూర్వ కలయికలో ప్రస్తుత ప్రధానోపాధ్యాయురారు పర్వీనా, పూర్వ విద్యార్థులు గిరి, వడ్డె నరసింహారావు, లక్ష్మణ్, ఆనంద్, కృష్ణ, ఉప్పలయ్య తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:పది సప్లిమెంటరీ ఉత్తీర్ణులను రెగ్యులర్‌గా పరిగణిస్తారా?