ఖమ్మం జిల్లా ఏన్కూరు మండల కేంద్రంలోని తెలంగాణ గురుకుల విద్యాలయంలో గతేడాది పదో తరగతి ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన వారికి పూర్వ విద్యార్థులు ప్రోత్సాహక నగదు బహుమతులు అందించారు.
ప్రతిభ కనబరుస్తున్నవారికి.. పూర్వ విద్యార్థుల ప్రోత్సాహకం - పూర్వ విద్యార్థుల సమ్మేళనం
తాము చదువుకున్న పాఠశాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్న విద్యార్థులకు పూర్వ విద్యార్థులు ఏటా ప్రోత్సాహక బహుమతులు అందిస్తున్నారు. ఏన్కూరులోని గురుకుల విద్యాలయంలో గతేడాది పదోతరగతి ఫలితాల్లో ప్రతిభ చూపిన వారికి బహుమతులు అందించారు.
ప్రతిభ కనబరుస్తున్నవారికి.. పూర్వ విద్యార్థుల ప్రోత్సాహకం
1985-88 విద్యాసంవత్సరంలో గురుకులంలో చదివిన విద్యార్థులు ఏటా ప్రతిభావంతులకు పురస్కరాలు అందిస్తున్నారు. ప్రస్తుతం పరీక్షలకు హాజరుకానున్న పదోతరగతి విద్యార్థులకు పరీక్ష సామగ్రి అందించారు. ప్రతి విద్యార్థి పట్టుదలతో చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు. అనంతరం చిన్ననాటి స్నేహితులతో కలిసిన పూర్వ విద్యార్థులు రోజంతా పాఠశాలలో ఆనందంగా గడిపారు.