తెలంగాణ

telangana

ETV Bharat / state

విద్యుదాఘాతంతో లారీ డ్రైవర్ మృతి - oil load lorry driver dead

నూనె ప్యాకెట్ల లోడు దిగుమతి చేసేందుకు వచ్చి... విద్యుదాఘాతంతో లారీ డ్రైవర్ మృతి చెందిన ఘటన వైరాలో చోటుచేసుకుంది. లారీ డోర్​ తీస్తుండగా పక్కనే ఉన్న ట్రాన్స్​ఫార్మర్​కు తగిలి ప్రమాదం జరిగింది.

విద్యుదాఘాతంతో లారీ డ్రైవర్ మృతి
విద్యుదాఘాతంతో లారీ డ్రైవర్ మృతి

By

Published : Jan 1, 2020, 9:48 PM IST

ఖమ్మం జిల్లా వైరాలో విద్యుదాఘాతానికి గురై లారీ డ్రైవర్ దుర్మరణం పాలయ్యాడు. ఓ పామాయిల్​ కంపెనీకి చెందిన నూనె ప్యాకెట్ల లోడుతో డ్రైవర్ వీరబాబు వైరాకు వచ్చాడు. సంతబజార్​లోని ఓ దుకాణంలో దిగుమతి చేశాడు. అనంతరం తిరిగి వెళ్లేందుకు లారీ డోర్ తీస్తుండగా... పక్కనే ఉన్న ట్రాన్స్​ఫార్మర్​కి తగిలి షాక్​కు గురయ్యాడు. వీరబాబును సమీపంలోని ఆసుపత్రికి తరలించగా... అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. హమాలీల ద్వారా పోలీసులు వివరాలు సేకరించగా... వీరబాబు కాకినాడకు చెందిన వ్యక్తిగా తెలిపారు.

విద్యుదాఘాతంతో లారీ డ్రైవర్ మృతి

ABOUT THE AUTHOR

...view details