Officials Removed flags and banners of political parties Telangana : తెలంగాణలో ఎన్నికల నియమావళి అమల్లోకి రావడంతో.. ఎక్కడికక్కడ ప్రభుత్వ ప్రకటనలను, ఫ్లెక్సీలను అధికారులు తొలగింపు ప్రక్రియ చేపట్టారు. ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి.. ఫ్లెక్సీలను తొలగిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ప్రభుత్వ పథకాల ప్రచార పోస్టర్లను అధికార యంత్రాంగం తొలగించింది. కలెక్టరేట్ ఆవరణతో పాటు ఆయా ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన పథకాల బోర్డులను తొలగించారు. కార్యాలయాల్లోని పీఎం, సీఎం ఫోటోలను తీసేశారు. రాష్ట్రంలో అంతటా ఎన్నికల హడావిడి మొదలైంది. ఎన్నికల కోడ్(Election Code) రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
Party Flexis Removed to Enforce Code of Conduct : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని డివైడర్లకు ఉన్న.. గులాబీ రంగులను తీసేసి తెల్లని రంగును వేశారు. ఖమ్మంలో అధికారులు.. ఎన్నికల కోడ్ అమలు చేసే పనిలో పడ్డారు. నగరంలో ఉన్న అధికార పార్టీ మంత్రి పువ్వాడ ఫ్లెక్సీలు తొలగించారు. వీధుల్లో అధికార కార్యక్రమాలకు చెందిన ప్రచార బోర్డులను తీసేస్తున్నారు.
GHMC Removed Posters and Banners :హైదరాబాద్లోబీఆర్ఎస్ పార్టీ(BRS Party) కార్యాలయం ఎదుట ఉన్న భారీ హోర్డింగ్‌లను.. ఎక్కడికక్కడ సంక్షేమ పథకాల సూచికలు తొలగిస్తున్నారు. అలాగే సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ కేంద్రంలో ఎన్నికల ప్రవర్తన నియమాల అమలుని అధికారులు వెంటనే ప్రారంభించారు. పట్టణంలోని ఆయా పార్టీల నేతలకు చెందిన విగ్రహాలను వస్త్రాలతో కనిపించకుండా ముసుగులు వేశారు. పలుచోట్ల గోడపత్రికలను తొలగించడంతో పాటు ప్రచార హోర్డింగుల తొలగింపు ప్రక్రియను చేపట్టారు.
Telangana Assembly Elections 2023 : రాష్ట్రంలో ఎన్నికల పూర్తి వివరాలు ఇవే..