తెలంగాణ

telangana

ETV Bharat / state

మాస్కులు ధరించని వారిపై జరిమానాల కొరడా - Khamma corona Lockdown

లాక్‌డౌన్‌ నిబంధనలను ఖమ్మం నగర పాలక సంస్థ అధికారులు పటిష్ఠంగా అమలు చేస్తున్నారు. మాస్కులు ధరించకుండా బయటకు వచ్చే వారిపై అధికారులు జరిమానాల కొరడా ఝళిపించారు.

జరిమానా
జరిమానా

By

Published : May 10, 2020, 4:48 PM IST

ఖమ్మంలో లాక్​డౌన్​ను అధికారులు పకడ్బందీగా అమలు చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కొరడా ఝళిపిస్తున్నారు. మాస్కులు ధరించకుండా బయటతిరిగే వారికి జరిమానాలు విధిస్తున్నారు. నగరంలోని స్టేషన్ రోడ్, కమాన్‌ బజార్‌లలో మాస్కులు లేకుండా తిరిగే వారికి నగర పాలక సంస్థ ఆర్​ఐ శ్రీనివాస రావు రూ. 1000 ఫైన్​ వేశారు.

దుకాణాలను తనిఖీలు చేసి నిబంధనలు పాటించని యాజమాన్యాలకు సైతం జరిమానాలు విధించారు. ప్రజలకు, దుకాణ యజమానులకు లాక్​డౌన్​ నిబంధనలపై అవగాహన కల్పించారు.

ఇవీ చూడండి:అమ్మా.. నీ మనసు వెన్న...

ABOUT THE AUTHOR

...view details