రాష్ట్రంలో ప్రవేశ పరీక్షల తేదీలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు ఖమ్మం కలెక్టర్ కార్యాలయం ముట్టడికి యత్నించారు. ముందుగా ధర్నా చౌక్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ తీసేందుకు వెళ్తుండగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులను తోసుకొని రోడ్డుపై పరుగులు పెట్టారు.
ప్రవేశ పరీక్షలు నిర్వహించవద్దని కలెక్టరేట్ ముట్టడికి ఎన్‌ఎస్‌యూఐ యత్నం - ఎన్‌ఎస్‌యూఐ ఖమ్మం కలెక్టరేట్ ముట్టడికి యత్నం
ప్రవేశ పరీక్షల తేదీలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎన్‌ఎస్‌యూఐ ఖమ్మం కలెక్టరేట్ ముట్టడికి యత్నించింది. ధర్నా చౌక్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్తున్న విద్యార్థి సంఘం నేతలను పోలీసులు అడ్డుకున్నారు. కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు గేట్లు మూసి అడ్డుకోవడంతో కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. అనంతరం వారిని లోనికి అనుమతించడంతో కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు.
NSUI
కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు గేట్లు మూసి అడ్డుకోవడంతో ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. అనంతరం లోనికి అనుమతించడంతో కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు.
ఇదీ చదవండి: ఉగ్ర గోదావరి.. కొనసాగుతోన్న మూడో ప్రమాద హెచ్చరిక