తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎన్నెస్పీ కాలువకు గండి.. నీట మునిగిన 100 ఎకరాల పంట! - ఎన్నెస్పీ కాలువ

గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పాటు.. నాగార్జున సాగర్​ ఎడమ కాలువ పరిధిలోని ఎన్నెస్పీ కాలువకు గండి పడడం వల్ల ఖమ్మం జిల్లా మధిర మండలంలో 100 ఎకరాల పంట నీట మునిగింది. అధికారులు తక్షణమే స్పందించి.. గండి పూడ్చే పనులు మొదలు పెట్టాలని, తమ పంట పొలాలు కాపాడాలని రైతులు కోరుతున్నారు.

NSP Canal Break Down in Khammam District Madhira
ఎన్నెస్పీ కాలువకు గండి.. నీట మునిగిన 100 ఎకరాల పంట!

By

Published : Aug 15, 2020, 8:22 PM IST

ఖమ్మం జిల్లా మధిర మండలం మాటూరుపేట, నాగవరప్పాడు గ్రామాల సమీపంలోని నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ ఎడమ కాలువ పరిధిలోని నిదానపురం మేజర్​గా పిలిచే ఎన్నెస్పీ కాలువకు గండి పడింది. గత నాలుగు రోజులుగా విరామం లేకుండా కురిసిన వర్షాలతో పాటు.. కాలువకు గండి పడడం వల్ల వచ్చిన వరద నీటి ప్రవాహం వల్ల పంట పొలాలు నీట మునిగాయి.

వరద నీరు, కాలువ నీటిలో మునిగి దాదాపు 50 నుంచి 100 ఎకరాల పంట నీటిలో మునిగినట్టు అధికారులు తెలిపారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట.. నీట మునిగిందని.. అధికారులు స్పందించి ఆదుకోవాలని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి ఎన్నెస్పీ కాలువ గండి పూడ్చాలని కోరుతున్నారు.

ఇవీ చూడండి:ఎర్రకోటపై మువ్వన్నెల జెండా రెపరెపలు

ABOUT THE AUTHOR

...view details