ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఎన్ఆర్ఐ ఫౌండేషన్ చేస్తున్న సాయం మరువలేనిదని ఖమ్మం డీఈవో మదన్ మోహన్ అన్నారు. ఖమ్మం జిల్లా కల్లూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని సుమారు 465 విద్యార్థులకు ఎన్ఆర్ఐ ఫౌండేషన్, పాఠశాల పూర్వ విద్యార్థులు ఆధ్వర్యంలో డీఈవో చేతుల మీదుగా నిఘంటువులను అందించారు.
కల్లూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు బంపర్ ఆఫర్ - nri foundation offers khammam students
ఖమ్మం జిల్లా కల్లూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఎన్ఆర్ఐ ఫౌండేషన్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ట్రిపుల్ ఐటీలో సీటు సాధించిన విద్యార్థులకు కోర్సు పూర్తయ్యే వరకు అయ్యే వ్యయాన్ని భరించేందుకు ముందుకువచ్చింది. పదో తరగతి ఫలితాల్లో పది పాయింట్లు సాధించిన విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందిస్తామని ప్రకటించింది.
![కల్లూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు బంపర్ ఆఫర్ khammam deo](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6214052-967-6214052-1582732987201.jpg)
కల్లూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు బంపర్ ఆఫర్
కల్లూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులెవరైన పదో తరగతి ఫలితాల్లో పది పాయింట్లు సాధిస్తే వారికి ప్రోత్సాహకాలు అందజేస్తామని ఎన్ఆర్ఐ ఫౌండేషన్ కార్యదర్శి బండి నాగేశ్వరరావు హామీ ఇచ్చారు. ట్రిపుల్ ఐటీలో సీటు సాధిస్తే కోర్సు పూర్తయ్యే వరకు అయ్యే వ్యయమంతా తాము భరిస్తామన్నారు.
కల్లూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు బంపర్ ఆఫర్
ఇవీచూడండి:టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ ఫేస్బుక్ హ్యాక్